టాలీవుడ్ లో స్టార్ కమెడియన్గా ఎదిగిన సునీల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన మొదటి నుండి డాన్సర్ కావాలని అనుకున్నాడు. కానీ నటుడుగా మారాడు. 2000 సంవత్సరంలో నువ్వే కావాలని సినిమాతో entey ఇచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అనంతరం 2006లో విడుదలైన అందాల రాముడు సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకున్నడో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా విజయాన్ని సాధించడమే కాకుండా సునీల్ కి హీరోగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.
దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత సునీల్ కు హీరో వరుస అవకాశాలు వచ్చాయి. అలా పూలరంగడు మిస్టర్ పెళ్ళికొడుకు తడాఖా భీమవరం బుల్లోడు వంటి సినిమాలను చేసి మంచి విషయాన్ని అందుకున్నాడు. కెరియర్ డౌన్ అవుతున్న సమయంలో మళ్లీ అరవింద సమేత వీర రాఘవతో కమెడియన్ గా మారాడు. అనంతరం పుష్ప సినిమాలో విలన్ గా మారి ప్రస్తుతం విలన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
ఈ మధ్య సునీల్ టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు అని చెప్పాలి. ఇటివల రజినీకాంత్ సినిమాలో కనిపించాడు. దీనికంటే ముందు శివ కార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలో సైతం ఒక కీలక పాత్రలో మెరిశాడు. తాజాగా ఇప్పుడు విశాల్ హీరోగా వచ్చిన మార్క్ ఆంటోని సినిమాలో సైతం కనిపించాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్లను వసూలు చేస్తోంది. అలా సునీల్ నటించిన ప్రతి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటున్నడు. దీంతో కోలీవుడ్ మేకర్స్ సైతం ఆయనకి వరుస అవకాశాలు ఇవ్వడానికి వెనకాడడం లేదు. ప్రస్తుతం సునీల్ కోలీవుడ్లో మరిన్ని సినిమాలను కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. అలా మొత్తానికి తమిళంలో వరస సినిమాలు చేస్తూ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్కొక్క రోజు కోసం ఏకంగా రెండు నుండి మూడు లక్షల వరకు తీసుకుంటున్నాడట సునీల్..!!