లియో మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..!?

Anilkumar
తమిళనాడులో వరుస బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న హీరో ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు విజయ్. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. సినిమాల్లో పెద్దగా కంటెంట్ లేకపోయినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం నిర్మాతలకి లాభాలను తెప్పించడంలో విజయ్ తర్వాతే మరే హీరో అయినా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన వారసుడు సినిమాకి సైతం మొదటి షో నుండే డివైడ్ టాక్ లభించింది.

కానీ ఫుల్ రన్ లో మాత్రం ఆ సినిమా 300 కోట్లకు పైగా అనే గ్రాస్ కలెక్షను వసూలు చేసి షాక్ ఇచ్చింది. ఇది విజయ కెరియర్ లోనే హైయెస్ట్. ఇలా ఇటీవల గా విడుదలైన విజయ్ సినిమాలన్నీ కూడా టాక్ సరిగ్గా లేనప్పటికీ కలెక్షన్స్ మాత్రం అదరహో అని అనిపించాయి. ఇక ఈ రేంజ్ ఫామ్ ని ఆస్వాదిస్తున్న విజయ్ ఇటీవల లోకేష్ కనగరాజ్ తో కలిసి లియో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తిచేసుకుని వచ్చే నెల దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ కనబరిచింది.

అయితే గతంలో లోకేష్ కనగరాజ్ తో  విజయ్ మాస్టర్ అనే సినిమా చేసి భారీ విషయాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా ఈ సినిమా తర్వాత లోకేష్ కమలహాసన్ తో విక్రమ్ సినిమా చేసి ఎంతటి సంచలనాన్ని సృష్టించాడో తెలిసిందే. ఇక అటువంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ లియో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా నీ మొదట విజయతో కాకుండా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలని అనుకున్నారట. కథ వినిపించినప్పటికీ ఎందుకో మహేష్ బాబుకి నచ్చకపోవడంతో ఈ సినిమా రిజెక్ట్ చేశాడట మహేష్ బాబు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: