షారుఖ్ ఖాన్: ఒకే ఏడాది 2 సినిమాలతో సూపర్ రికార్డ్స్?

Purushottham Vinay
దశాబ్ద కాలంగా సక్సెస్ లేక ఢీలా పడ్డ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌ కి ఈ ఏడాది ఆరంభం లో వచ్చిన పఠాన్ సినిమా భారీ విజయాన్ని ఇచ్చిన విషయం తెల్సిందే. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ సినిమా షారుఖ్‌ ఖాన్ స్థాయిని నిరూపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ పఠాన్ సినిమా విడుదల అయిన కొన్ని నెలల్లోనే జవాన్ సినిమా వచ్చింది. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే దాదాపు రూ.800 కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా అతి త్వరలో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇంకా అంతేగాక మిగిలిన దేశాల్లో కూడా జవాన్ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. ఆష్ట్రేలియాలో 3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. పఠాన్ కూడా ఈ మార్క్ రీచ్ అయ్యింది. దీంతో ఆష్ట్రేలియాలో వరుసగా రెండు సినిమాలతో అంటే 2 సార్లు 3 మిలియన్ డాలర్లు టచ్ చేసిన ఏకైక భారతీయ నటుడుగా షారుఖ్ రికార్డ్ సృష్టించాడు.



అలాగే నార్త్ అమెరికాలో  జవాన్ సినిమా 10 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది.పఠాన్ కూడా దాదాపు 15 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. దీంతో నార్త్ అమెరికాలో కూడా తన సినిమాలతో 2 సార్లు 10 మిలియన్ డాలర్లు నమోదు చేసిన తొలి భారతీయ నటుడుగా షారుఖ్ రికార్డ్ సృష్టించాడు.ఒక వైపు జవాన్ మూవీ వెయ్యి కోట్ల వైపు దూసుకు వెళ్తూ ఉంటే మరో వైపు షారుఖ్‌ ఖాన్‌ దుంకి సినిమా తో రెడీ అవుతున్నాడు. క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాని కూడా ఇదే ఏడాది డిసెంబర్‌ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. కానీ ఈ సినిమా మేకింగ్ విషయంలో ఆలస్యం అవ్వడంతో ఈ ఏడాది విడుదల అవ్వడం సాధ్యం కాదు అంటూ బాలీవుడ్ మీడియా నుంచి సమాచారం వినిపించింది. ఈ సినిమా ఆలస్యం గురించి వస్తున్న వార్తలపై షారుఖ్‌ ఖాన్‌ స్పందించాడు. కచ్చితంగా క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమా విడుదల అవ్వబోతుందని ప్రకటించాడు. ఈ సినిమాకు రాజ్ కుమార్‌ హిరానీ దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు ఖచ్చితంగా ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: