వెంకటేష్ ను అయోమయంలో పడేసిన ప్రభాస్ !
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని డిసెంబర్ లో విడుదలచేయాలి అన్న ఆలోచనలలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు టాక్. అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈమూవీ విడుదలకు డిసెంబర్ లో వచ్చే క్రిస్మస్ సీజన్ అన్నివిధాల కలక్షన్స్ విషయంలో బాగుంటుందని ఈమూవీ నిర్మాతలు భావిస్తూ ఉండటంతో ‘సలార్’ ను డిసెంబర్ లో విడుదల చేయడం ఖాయం అన్నసంకేతాలు వస్తున్నాయి.
ఈవార్తలే నిజం అయితే ‘సలార్’ విడుదల వల్ల వెంకటేష్ నాని నితిన్ లకు సమస్యలు తప్పవు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. వెంకటేష్ నటిస్తున్న ‘సైంధవ్’ నాని నటిస్తున్న ‘హాయ్ నాన్న’ నితిన్ నటిస్తున్న ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలు డిసెంబర్ విడుదలకోసం ఇప్పటికే తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటించి డానికి అనుగుణంగా తమ సినిమాల ప్రమోషన్ ను ప్లాన్ చేసుకుంటున్నాయి.
ఇప్పుడు ఊహించని సునామిలా ఈసినిమాల మధ్య ‘సలార్’ పోటీ పడితే ధియేటర్ల సమస్యతో పాటు ప్రభాస్ మ్యానియాతో పోటీ పడటం కొంతవరకు నాని వెంకటేష్ నితిన్ లకు సమస్యగా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనితో ఈసినిమాలలో కొన్ని డిసెంబర్ రేస్ నుండి తప్పుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వడానికి ప్రయత్నిస్తాయి. అయితే ఇప్పటికే సంక్రాంతి సినిమాలు కూడ తమ రిలీజ్ డేట్ ను చాల ముందుగా ప్రకటించి రిజర్వ్ చేసుకోవడంతో వెంకటేష్ నాని నితిన్ లలో ఎవరు ప్రభాస్ గురించి త్యాగం చేస్తారు అన్న విషయమై ఊహాగానాలు మొదలయ్యాయి..