సలార్ వాయిదాతో విదేశాలకు పయనమైన ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జాప్యం కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే విడుదల కాబోతోంది. మరోవైపు ప్రాజెక్టు కె షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది. దానితోపాటు మారుతి సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో సైతం ప్రభాస్ పాల్గొంటున్నాడు. అంతే కాదు ఇప్పటికే దానికి సంబంధించిన కొంతమేర షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు.


 అయితే ఈ మధ్య ఒక భారీ సెట్ సీన్ ను కూడా షూట్ చేయడం జరిగింది. సలార్ సినిమా వాయిదా పడడంతో ప్రభాస్ విదేశీ ట్రిప్ వేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సలార్ సినిమా వాయిదా విషయం ఈరోజు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. కానీ ఇలా వాయిదా పడుతుందని చిత్ర బృందం ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ఈ విషయం ప్రభాస్ కి కూడా తెలుసు. అందుకే ప్రాజెక్ట్ కె మారుతీ సినిమాల షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్లాడట.  ప్రభాస్ విదేశాల నుండి తిరిగి రాగానే మిగిలిన సినిమాల షూటింగ్లను కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.


అయితే ప్రభాస్ విదేశీ పర్యటనకు వెళ్లారని తెలుసు కానీ ఏ దేశం వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అన్నది మాత్రం ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. కానీ సర్జరీ కోసమే ప్రభాస ఫారం కి వెళ్ళాడు అన్న సమాచారం సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సన్నివేశాలు చేయడం వల్ల ప్రభాస్ కు కాలినొప్పి సమస్య వచ్చింది అని ఇప్పటివరకు తగ్గడం లేదు అని ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టాలి అని ప్రభాస్ మోకాలు సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సర్జరీ తర్వాత విదేశాల్లోనే రెండు మూడు వారాలపాటు ఉండి విశ్రాంతి కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. దాని తరువాత ఇండియాకి తిరిగి వచ్చి షెడ్యూల్ ప్రకారం షూటింగ్లో పాల్గొంటాడట. ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: