అనిరుధ్ మ్యానియాతో తల పట్టుకుంటున్న జూనియర్ నాని !
ఇప్పుడు ఇదిచాలదు అన్నట్లుగా ఇండియన్ బాక్సాఫీస్ ను కలెక్షన్స్ లో షేక్ చేస్తున్న షారూఖ్ ఖాన్ ‘జవాన్’ మ్యూజిక్ విషయంలో కూడ అనిరుధ్ మ్యూజిక్ యునానిమస్ గా ది బెస్ట్ అంటూ రిపోర్ట్స్ రావడంతో అనిరుధ్ మ్యానియా ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఇతడు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ కు అదేవిధంగా విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి ప్రాజెక్ట్ కు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకు అనిరుధ్ కు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ కలిసిరాలేదు. గతంలో అతడు సంగీతం సమకూర్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు అన్న విషయం తెలిసిందే. దీనితో కొరటాల శివ ‘దేవర’ సినిమా విషయంలో అనిరుధ్ నుండి ఎలాంటి ట్యూన్స్ రాబట్టుకుంటాడు అన్నసందేహాలు తారక్ అభిమానులలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనికితోడు దేశవ్యాప్తంగా అనిరుధ్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో అతడిని సినిమా పాటల ట్యూనింగ్ కోసం చెన్నై నుండి హయదేరాబాద్ తీసుకురావడం ఒక సమస్యగా మారింది అని కూడ అంటున్నారు. ఇదే పరిస్థితి నాని గౌతమ్ తిన్ననూరి సినిమాకు కూడ ఏర్పడింది అంటున్నారు. ప్రస్తుతం అనిరుధ్ కు ఏర్పడిన మ్యానియా రీత్యా అతడు సంగీత దర్శకుడుగా ఒప్పుకుంటే చాలు అన్న అభిప్రాయంలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. లేటెస్ట్ గా విడుదలైన ‘జవాన్’ బ్లాక్ బష్టర్ హిట్ కావడంతో అనిరుధ్ మ్యానియా బాలీవుడ్ లో కూడ విపరీతంగా పెరిగిపోయింది. దీనితో అనిరుధ్ మ్యానియాను చూసి జూనియర్ నాని లు టెన్షన్ పడుతున్నారు అంటూ ఇండస్ట్రి వర్గాలలో గుసగుసలు హడావిడి చేస్తున్నాయి..