ఆ విషయంలో మహేష్ ను ప్రశ్నిస్తున్న సమంత....!!
ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో తిరిగి ఈ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా తర్వాత ఈయన రాజమౌళి సినిమాతో బిజీ కాబోతున్నారు. ఇలా వరుస సినిమాలతో మహేష్ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే గతంలో మహేష్ బాబు సమంత, త్రివిక్రమ్ ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సమంత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా సమంత మహేష్ బాబుని ప్రశ్నిస్తూ మీరు ప్రేక్షకులకు ఎప్పుడు మీ సిక్స్ ప్యాక్ బాడీని చూపించబోతున్నారు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ చూపించను... నా బాడీని ఎవరికి చూపించను అంటూ సమాధానం చెప్పడంతో అదేంటి మహేష్ గారు ఇలా అందరిని డిసప్పాయింట్ చేశారు అంటూ సమంత మాట్లాడారు అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి త్రివిక్రమ్ తో సమంత మాట్లాడుతూ మీరైనా ఈయన చేత సిక్స్ ప్యాక్ బాడీని చూపించేలా చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి