తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా సునీల్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈయన ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో భాగంగా ఈయన హీరోగా నటించిన అందాల రాముడు , మర్యాద రామన్న , పూల రంగడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఆ తర్వాత ఈయన అనేక సినిమా లలో హీరోగా నటించినప్పటికీ ఆ మూవీ లు మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయాయి.
దానితో ఈయన మళ్ళీ సినిమాల్లో కామెడీ పాత్రలలోనూ నటిస్తున్నాడు. అలాగే విలన్ మరియు ఇతర కీలక పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి పుష్ప ది రైస్ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సునీల్ తన నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించాడు. ఇకపోతే ప్రస్తుతం సునీల్ ... సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో సునీల్ పాత్ర చాలా హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈయన ఈ మూవీ లో చాలా మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు ... ఈయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే గుంటూరు కారం మూవీ లో మహేష్ సరసన శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.