రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దుమ్ము లేపిన "జవాన్" మూవీ..!

Pulgam Srinivas
షారుక్ ఖాన్ తాజాగా జవాన్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నయన తార , షారుఖ్ కి జోడి గా నటించగా ... దీపికా పదుకొనే ఈ మూవీ లో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతుంది. ప్రియమైన , యోగి బాబు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన హిందీ , తమిళ్ , తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ టికెట్ లను బుక్ మై షో ఆన్లైన్ ఆప్ లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ టికెట్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.  ప్రస్తుతం అద్దుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి 5 రోజుల్లో బుక్ మై షో లో రోజు వారిగా ఏ రేంజ్ టికెట్ లు సోల్డ్ అవుట్ అయ్యాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మొదటి రోజు బుక్ మై షో ఆప్ లో జవాన్ మూవీ కి సంబంధించిన 254.03 టికెట్యూ సోల్డ్ అవుట్ అయ్యాయి.

2 వ రోజు బుక్ మై షో ఆప్ లో జవాన్ మూవీ కి సంబంధించిన 181.3 కే టికెట్ లు సోల్డ్ అవుట్ అయ్యాయి.

3 వ రోజు బుక్ మై షో ఆప్ లో జవాన్ మూవీ కి సంబంధించిన 182.41 కే టికెట్ లు సోల్డ్ అవుట్ అయ్యాయి.

4 వ రోజు బుక్ మై షో ఆప్ లో జవాన్ మూవీ కి సంబంధించిన 201.71 కే టికెట్ లు సోల్డ్ అవుట్ అయ్యాయి.

5 వ రోజు బుక్ మై షో ఆప్ లో జవాన్ మూవీ కి సంబంధించిన 286.3 కే టికెట్ లు సోల్డ్ అవుట్ అయ్యాయి.

5 రోజులకు కలిపి మొత్తంగా బుక్ మై షో ఆప్ లో జవాన్ మూవీ కి సంబంధించిన 1.1 మిలియన్ టికెట్ లు సోల్డ్ అవుట్ అయ్యాయి.

ఇలా జవాన్ మూవీ బుకింగ్ లకి బుక్ మై షో యాప్ లో ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: