నా పేరెంట్స్ కూడా ఇప్పటివరకు అలా అడగలేదు.. అభిమాని పై సీరియస్ అయిన తమన్నా..!?

Anilkumar
నటుడు విజయ్ వర్మతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రేమలో ఉంది అన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  అంతేకాకుండా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అన్న వార్తలు పై తమన్నతో పాటు విజయవర్మ సైతం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇటీవల జైలర్ సినిమాతో తెలుగు తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది తమన్న. ఇక ఈ సక్సెస్ ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడుపుతోంది. ఇక ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో


 తమన్నా పాల్గొనడం జరిగింది. అయితే ఆ ఈవెంట్లో భాగంగా అభిమానులతో కొన్ని విషయాలను పంచుకుంది. ఇక ఈ సందర్భంగా మీ పెళ్లి ఎప్పుడు తమిళ అబ్బాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందా అని ఒక ఫ్యాన్ తమన్నాని అడిగాడు. ఇక దానికి సమానంగా పెళ్లి ప్రశ్నకు తమన్నా అసహనం వ్యక్తం చేసింది. అనంతరం ఇప్పటివరకు మా అమ్మ నాన్నలు కూడా నన్ను పెళ్లి గురించి ఎప్పుడూ ఇలా డైరెక్ట్ గా ప్రశ్న అడగలేదు అంటూ ఆ అభిమాని పై ఒక రేంజ్ లో సీరియస్ అయింది తమన్నా.  మీరు అనుకున్న లక్షణాలున్న వ్యక్తి మీ జీవితంలో వచ్చాడా


 అని అడిగిన ప్రశ్నకు తమన్నా చాలా తెలివిగా సమాధానాన్ని ఇచ్చింది. జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది అని ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉన్నాను అంటూ ఆ ప్రశ్నకి బదులు వచ్చింది. అనంతరం విజయవర్మ పేరుని మాత్రం ఎక్కడా కూడా బయట పెట్టలేదు. విజయవర్మకి సంబంధించిన ప్రశ్నలను దాటేసై ప్రయత్నం చేస్తుంది ఆమె . తరువాత జైలర్ సినిమాతో పాటు తెలుగులో తమన్నా హీరోయిన్గా నటించిన భోళాశంకర్ సినిమా ఒక రోజు గ్యాప్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. దీంతో తమన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: