వావ్:అభిమానుల కోసం అదిరిపోయే డెసిషన్ తీసుకున్న విజయ్ దేవరకొండ..!!

Divya
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో ఎట్టకేలకు మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇందులో హీరోయిన్ గా సమంత నటించిన సెప్టెంబర్ 1వ తారీఖున ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. ఇప్పటివరకు ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్ల క్రాస్ వసూలు సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చిత్ర బృందం మొదలుపెట్టారు. ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేయడం జరిగింది.

సినిమా సూపర్ హిట్ గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ అలాగే ఖుషి సక్సెస్ను ఎంజాయ్  చేస్తున్న అభిమానులకు సైతం అదిరిపోయే గిఫ్ట్ ని ఇవ్వడం జరిగింది ఏకంగా కోటి రూపాయలు సహాయం అందిస్తానంటూ తెలియజేశారు. ఖుషి సినిమా కేవలం మూడు రోజులలోనే రూ 70 కోట్లను సాధించడంతో చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి..తన రెమ్యూనరేషన్ నుంచి విజయ్ దేవరకొండ కోటి రూపాయలు ఇచ్చి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 100 కుటుంబాలకు సహాయం అందిస్తానంటూ తెలియజేశారు. ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం చాలా ఆనందంతో విజయం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

తన సినిమా ఫెయిల్ అయ్యిందని బాధపడతారు హిట్ కొడితే సంతోషిస్తారు నా కుటుంబంలోకి మీరు కూడా వెన్నంటే ఉంటున్నారు కాబట్టి.. అందుకే తన సంతోషాన్ని కూడా మీ అందరితోనూ పంచుకోవాలని ఈ మీటింగ్ ని అరేంజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరి కోసం కోటి రూపాయలు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను బాగా సాధించాలని అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని తెలియజేశారు విజయ్ దేవరకొండ. ఎవరికైనా చదువులు ఇతరత్రా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి తన సపోర్టు ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. మీ అందరి కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాను నా సంపదలో కొంత మొత్తం మీకు ఇవ్వాలని అనుకున్నాను అని తెలిపారు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: