బిగ్ బాస్ 7.. నేటి నుంచే ఆరంభం..!
ఆ సీజన్ వల్ల షాక్ తిన్న బిగ్ బాస్ టీం సీజన్ 7 ని ఎంతో ఫోకస్ గా ప్లాన్ చేశారు. ఈసారి ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సీజన్ కి బజ్ అయితే బాగానే ఉంది. అంతేకాదు ఈ సీజన్ లో ఎక్కువగా టీవీ ఆర్టిస్ట్ లు ఉండటం కూడా షోని నిలబెట్టే ప్రయత్నంలో భాగమే అని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవరెవరు వస్తున్నారు అన్నది ఇప్పటికే ఓ లిస్ట్ ఫైనల్ కాగా చివరి నిమిషంలో ఒకరిద్దరిని మార్చి హౌజ్ లోకి ప్రవేశ పెట్టారని తెలుస్తుంది.
బిగ్ బాస్ 7 తెలుగు సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని.. ఈ సీజన్ ని ఎలాగైనా ఆడియన్స్ చేత సూపర్ అనిపించాలని బిగ్ బాస్ టీం వెరైటీ టాస్క్ లను పెట్టాలని చూస్తుంది. అంతేకాదు ఈ సీజన్ సెలబ్రిటీస్ కూడా ఎక్కువే అవడం వల్ల కచ్చితంగా ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ 7 ముందు సీజన్ల కన్నా ఎక్కువ మెప్పిస్తుందా సీజన్ 6 తో షో మీద ఆసక్తి కోల్పోయిన ఆడియన్స్ ని మళ్లీ ఎట్రాక్ట్ చేస్తుందా అన్నది చూడాలి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 7 మొదలు అవుతుంది. నాగార్జున హోస్ట్ గా హౌజ్ మెట్స్ అందరిని బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించి గేటుకి లాక్ వేసేస్తారు నాగార్జున.