విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసిన విశ్వక్..!?

Anilkumar
ఆహా ఫ్యామిలీ ధమాకా అనే రియాలిటీ షో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్న సంగతి చాలామందికి తెలిసి ఉంటుంది. సెప్టెంబర్ 8 నుండి ఆహాలు ఈ షో స్ట్రీమింగ్ కాబోతుంది ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ షో రాబోతోంది. అయితే ఈ షోలో టాలీవుడ్ వరసటైల్ యంగ్ హీరో విశ్వక్సేన్ హాట్ గా వ్యవహరించబోతున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే విశ్వక్క మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్లను చేయడం జరిగింది. దీంతో అవికాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే విశ్వక్ మాట్లాడుతూ బేసికల్లీ అందరం మనకి అన్ని తెలుసు అన్ని లెక్కలు వేసుకుంటా..


కొన్నిసార్లు మనం పాన్ ఇండియా  సినిమా తీయాలని అనుకుంటాం కానీ అది గల్లి సినిమాగా మారుతుంది.. కొన్నిసార్లు మనం చిన్న సినిమా తీస్తాం కాంతారా లాంటి సినిమా వాళ్ళు ముందు పాన్ ఇండియా అనుకోలేదు.. కానీ ఆ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా మారాయి. సినిమాల పరంగా నా ప్లానింగ్ అది.. ఏది 100 కోట్ల సినిమా అవుతుందో ఏది పాన్ ఇండియా హిట్ అవుతుందో అన్నది ఎవరికీ తెలియదు. అయితే నిజానికి విశ్వక్ తన ఉద్దేశాన్ని ఏంటో అన్నది తెలియజేశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం హీరో విజయ్ దేవరకొండ నీ టార్గెట్ చేస్తూ విశ్వక్ ఈ కామెంట్స్ ని చేశారు అని అంటున్నారు.


అయితే గతంలో విజయ్ దేవరకొండ అభిమానులు మరియు విశ్వకుల మధ్య సోషల్ మీడియాలో కాస్త గొడవలు జరిగాయి. ఆ తర్వాత విశ్వక్ ఏది మాట్లాడినా కూడా విజయ్ దేవరకొండ తో లింక్ చేసి చూస్తున్నారు చాలామంది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు చాలామంది. నిజానికి విశ్వక్ ఇక్కడ విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు. అలా అని వేరే హీరో గురించి కూడా మాట్లాడలేదు. కేవలం పాన్ ఇండియా సినిమాల గురించి మాత్రమే మాట్లాడాడు. ఏదేమైనప్పటికీ విశ్వక్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: