బిగ్ బాస్ 7 కాన్సెప్ట్ లీక్.. నిజంగానే ఉల్టా ఫల్టా?
స్ట్రాంగ్ కంటెస్టెంట్లను సైతం కావాలని ఎలిమినేట్ చేస్తున్నారంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి విమర్శలను దాటుకుంటూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడమె లక్ష్యంగా బిగ్ బాస్ నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఏడవ సీజన్ ప్రారంభం అవ్వడానికి అంత సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇక మరోసారి నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నాడు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా బిగ్బాస్ 7 సరికొత్తగా ఉండబోతుందని ఉల్టా పల్టా అంటూ ఇక ఈ షోపై మరింత అంచనాలను పెంచేశాడు నాగార్జున.
అయితే ప్రోమోలలో ఇలాగే చెబుతారు. కానీ ఆ తర్వాత రెగ్యులర్ గేమ్స్.. రెగ్యులర్ టాస్కులతో అందరికీ చిరాకు తెప్పిస్తారు అని కొంతమంది ప్రేక్షకులు భావించారు. కానీ ఇటీవలే బిగ్ బాస్ ఏడవ సీజన్ కు సంబంధించిన కాన్సెప్ట్ లీక్ అయింది. ఇది తెలిసి నిజంగానే నాగార్జున చెప్పినట్లు అంతా ఉల్టా పల్టా ఉండబోతుంది అని అందరూ అనుకుంటున్నారు. సాధారణంగా బిగ్బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ అందరినీ కూడా పంపిస్తారు. కానీ ఈసారి 20 మంది కంటెస్టెంట్ ని రెండు వేరువేరు హౌస్లలోకి పంపించబోతున్నారట. అంటే ఒకే షో కానీ రెండు బిగ్ బాస్ హౌస్ లు. కంటెస్టెంట్స్ గేమ్స్ టాస్క్ పరిస్థితుల ఆధారంగా ఇల్లు మారుతూ ఉంటారట. ఈ విషయం తెలిసి కాన్సెప్ట్ క్రేజీగా ఉంది. ఇక షోఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నాం అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.