మహేష్ తో చేయబోయే సినిమా అలా ఉంటుందని స్పష్టం చేసిన రాజమౌళి....!!
ఇక మహేశ్ బాబుతో తాను తీయబోయే చిత్రం అడ్వెంచర్ యాక్షన్ జానర్‌లో ఉంటుందని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇండియానా జోన్స్ సిరీస్‍లా అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఆ మూవీ ఉంటుందని తెలిపాడు. మహేశ్‍తో తీయబోయే ఈ చిత్రం గ్లోబల్ సినిమాగా ఉంటుందని స్పష్టం చేశాడు. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి ఎలాంటి హద్దులు లేని గ్లోబల్ సినిమాలను తెరకెక్కించాలనే తపన తనకు చాలా ఉందని రాజమౌళి తెలిపాడు. "ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి గ్లోబల్ సినిమాలు తీయాలని నేను ఎప్పుడూ అనుకుంటా. అడ్వెంచరస్ జానర్‌లో ప్రస్తుతం మా నాన్న ఓ సినిమా రాస్తున్నారు. స్క్రిప్ట్‌ను మేం ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అయితే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి" అని రాజమౌళి అన్నాడు. "నా తర్వాతి మూవీ మహేశ్ బాబుతో చేస్తున్నా. ఇది గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుంది. భారతీయ మూలాలతో.. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్‍ను పోలిన మూవీగా ఉంటుంది" అని రాజమౌళి చెప్పాడు. రాజమౌళి - మహేశ్ బాబు మూవీ వర్కింగ్ టైటిల్ SSMB29గా ఉంది. ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.