టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరీక్ష అవసరం లేదు. ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ
పూరి జగన్నాథ్ స్టైల్ మాత్రం అందరి దర్శకుల కంటే చాలా డిఫ్రెంట్ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కించి
బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు
పూరి జగన్నాథ్. ఇక ఆయన సినిమాలలో డైలాగులు వల్లే హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పూరీ తో
సినిమా చేయాలని ఇప్పటికే చాలా మంది హీరోలు క్యూ కడుతున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ సినిమాలు చేయడం కాస్త తగ్గించాడు. కానీ మళ్ళీ ఫామ్ లోకి రావాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎందరో హీరోలను తన సినిమాలతో స్టార్ హీరోలను చేసాడు పూరి. అంతేకాదు ఇప్పటికీ కొత్త కొత్త హీరోయిన్ల ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూనే ఉన్నారు. అలా
పోకిరి సినిమాతో ఊహకందని స్టార్
డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పూరి.ప్రస్తుతం డబుల్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమాలో యంగ్
హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో నే
డైరెక్టర్ కాకముందు
పూరి ఏం చేసేవాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు
పూరి కేవలం కథలను మాత్రమే రాసి దర్శకులకి అందించే వాడట .అలా చాలామంది దర్శకులకు కథలు రాసేటప్పుడు అలా 100 రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వాడట. దాంతోపాటు ఆ కథకు తగ్గట్టుగానే షార్ట్ యానిమేషన్ బొమ్మలు కూడా గీసే వాడటం పూరి. అవాటికి గాను వారానికి 50 రూపాయలను తీసుకుని వాడట. కాగా ఈ విషయాన్ని
పూరి జగన్నాథ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. దీంతో
పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఈ వార్తలు కాస్త ఎక్కువ సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు పూరీ జగన్నాథ్..!!