ఆ ప్రముఖ నటుడి వాయిస్ ఓవర్ తో "ఓజి" టీజర్ విడుదల..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ "ఓజి" లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఇకపోతే పవన్ ఈ సినిమాలో చాలా సంవత్సరాల తర్వాత గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు . దీనితో ఈ మూవీ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు . ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ ... పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రకాష్ రాజ్ , అర్జున్ దాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.


ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ టీజర్ ను సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ టీజర్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ టీజర్ ను ఇప్పటికే ఈ చిత్ర బృందం రెడీ చేసినట్లు అందులో భాగంగా ఈ మూవీ టీజర్ ను అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


ఇకపోతే అర్జున్ దాస్ ఇప్పటికే ఖైదీ , మాస్టర్ మూవీ లతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. "ఓజి" మూవీ లో కూడా ఈ నటుడు అదిరిపోయే రేంజ్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: