హీరోయిన్ బౌలింగ్ చూసి సచిన్ షాక్.. వైరల్ వీడియో?
గ్లామర్ అనే మూవీ రూపొందింది. అభిషేక్ బచ్చన్, సయామీకేర్ కలిసి నటించిన ఈ సినిమా ఒక స్పిన్ బౌలర్ చుట్టూ తిరుగుతుంది. కుడి చేయి కోల్పోయిన ఒక అమ్మాయి.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా ఎలా ఎదిగింది అనేది మూవీలో చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు ఆర్ బాల్కే దర్శకత్వం వహించారు. చేయి లేని క్రికెటర్ పాత్రలో సయామీకేర్ కనిపించగా.. ఆమె కోచ్గా అభిషేక్ బచ్చన్ కనిపించబోతున్నాడట. ఆగస్టు 18వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్ అతిధి పాత్రలో కనిపించబోతున్నారు అని చెప్పాలి.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర బంధం బిజీబిజీగా ఉంది. కాగా మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ సయామీకేర్ ప్రపంచ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను కలిసింది. కాసేపు ఆయనతో సరదాగా ముచ్చటించి క్రికెట్ మెలుకువలను నేర్చుకుంది. ఈ క్రమంలోనే ఇక బౌలింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా బౌలింగ్ చేస్తే రన్స్ రాకుండా చేయవచ్చు అనే విషయాలను కూడా సచిన్ను అడిగింది సయామీకేర్. ఈ సందర్భంగా లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ చేసే సయామీ ఖేర్ ఆకట్టుకుంది. ఆమె బౌలింగ్ పై సచిన్ ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా చేసావ్. నేను ఇప్పటివరకు ఇలాంటి యాక్షన్ ఉన్న బౌలింగ్లో ఆడలేదు అంటూ సచిన్ ప్రశంసించాడు.