బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం హైయెస్ట్ నెట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరం పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా జాన్ అబ్రహం ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 524.55 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 511 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించారు.

యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 435.20 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది .

తాజాగా విడుదల అయిన గడర్ మూవీ కేవలం పది రోజుల్లోనే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 375.10 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతూ భారీ కలెక్షన్ లను బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది.

అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన దంగల్ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 374.45 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: