లియో.. విజయ్ కెరియర్ లోని బెస్ట్ సినిమా.. నిర్మాత హాట్ కామెంట్స్..!!

Divya
విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లియో ..ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక విషయాన్ని తెలియజేశారు నిర్మాత లలిత్ కుమార్.


ఇటీవల మీడియా ఇంట్రడక్షన్ లో మాట్లాడుతూ లియో మరియు హీరో విజయ్ గురించి పంచుకోవడం జరిగింది.. లియో సినిమాలో ఇప్పటివరకు విజయ్ ని చూడని నటన చూస్తారని..తన కెరియర్ లోనే అత్యుత్తమ చిత్రంగా లియో సినిమా నిలుస్తుందని ప్రకటించడం జరిగింది. దీంతో ఈ సినిమా పట్ల అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ సమయానికి ముందు 8ది నిమిషాలు చాలా అద్భుతంగా ఉందని అది  ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా కనిపిస్తుందని.. ఇండియన్ సినిమాలోని చర్చనీయాంశంగా ఈ సన్నివేశం మారుతుందని లలిత్ కుమార్ తెలియజేయడం జరిగింది. లియో సినిమా సెట్ నుంచి ఇలా ఆసక్తికరమైన విషయాలను లలిత్ కుమార్ పంచుకోవడం ఇదేమి మొదటిసారి కాదు.


గతంలో కూడా మంచులో ఇరుక్కుపోయిన కారుని నెట్టడం విజయ్ తో చర్చతో కూడిన ఒక సన్నివేశాలను కూడా పంచుతూ వివరించారు తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో కూడా తమ కారు మంచులో కదలకుండా పోయిందని లలిత చేయడం జరిగింది. అయితే విజయ్ కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా తమతో పాటు దిగి కారుని తోయడం కూడా జరిగిందని తెలిపారు. విజయ్ 20 డిగ్రీల సెల్సియస్ మంచులో కూడా ఉష్ణోగ్రతలలో షర్టులేస్ ప్రదర్శన కూడా చేశారని లలిత్ కుమార్ తెలియజేశారు.. లియో సినిమా విజయ్ కెరియర్ లోనే ఒక అత్యుత్తమ సినిమాగా నిలబడుతుందని కూడా తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: