పాన్ ఇండియా హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రియాంక మోహన్..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఎంత టి క్రీజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో అనే సినిమాలో చేస్తున్నాడు దళపతి విజయ్. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ మరో క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు  దర్శకత్వంలో సైతం ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా విజయ్ 68వ సినిమాగా రాబోతున్నట్లుగా తెలిపాడు డైరెక్టర్. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయం


 సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక అరుళ్ మోహన్ ఫిక్స్ అయింది అన్న సమాచారం వినబడుతోంది. కాగా ఈ సినిమాలో జ్యోతిక సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది అని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో ముందుగా చాలామంది హీరోయిన్లు ను అనుకున్నప్పటికీ ఈ సినిమాలో వారెవ్వరు ఫైనల్ కాలేదు. కానీ విజయ్ దళపతి నటిస్తున్న ఈ సినిమాలో త్రిష సైతం ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతోపాటు డైరెక్టర్ ప్రియా భవాని శంకర్ నటిస్తుంది


అన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ప్రియాంక మోహన్ విజయ దళపతి నటిస్తున్న ఈ సినిమాలో కన్ఫామ్ అయ్యింది అని అంటున్నారు. ప్రియాంక మోహన్  ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ అందాల తార. దీంతో ఈ బ్యూటీకి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు  కోలీవుడ్లో సైతం ఆమెకి అవకాశం రావడంతో కోలీవుడ్లో టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: