టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఈమె. ఇక ఈ సినిమా తర్వాత ఆమె వరుస సినిమాలతో బిజీగా మారుతుంది అని అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలతో సైలెంట్ అయ్యింది అనుష్క. ఇక చివరిగా ఆమె నిశ్శబ్దం సినిమాతో కనిపించింది. ఇక ఈ సినిమా ఓటీటిలో విడుదలైంది. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ అనుష్క వెండితెరపై
కనిపించడానికి రెడీగా ఉంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటిస్తున్న సినిమా దర్శకుడు మహేష్ పి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్స్ పాటలు అలాగే ట్రైలర్ కూడా విడుదలైంది. ఇక విడుదలైన ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. మొత్తానికి ఈ సినిమాతో అనుష్క మళ్ళీ ప్రేక్షకులను ఎడ్ టైం చేయడానికి రెడీ అయింది. ఈ నేపద్యంలోనే తాజాగా
ఈ సినిమా ట్రైలర్ పై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్ చూసి నవ్వు ఆపకోలేకపోయాను అని తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. కాగా ఇందులో స్వీటీ నవీన్ ఇద్దరు చాలా అద్భుతంగా నటించారు అంటూ వారిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు ప్రభాస్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఆ ట్రైలర్ ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేయడంతో అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!