బాలీవుడ్ కి మళ్ళీ చుక్కలు చూపిస్తున్న రజినీకాంత్?

Purushottham Vinay
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే గత కొంత కాలంగా సరైన హిట్టు లేక సతమతం అవుతున్నారు. అయితే తన రేంజ్ హిట్టు పడితే మాత్రం అసలు ఏ స్టార్ కూడా రజినికి సరి తూగడు అనే విషయం తాజాగా రుజువు అయ్యింది.తన తాజా చిత్రం జైలర్ తో సూపర్ స్టార్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని చోట్లా రికార్డులను బద్దలు కొడుతోంది. ఇంకా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ వసూళ్లతో సూపర్ స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది.ఇంకా రెండో వారాంతంలో కూడా కలెక్షన్లు ఎక్కడా తగ్గకుండా చాలా భారీగా పెరిగాయి.ఇక ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. జైలర్ యూఎస్ ప్రాంతంలో ఏకంగా 2.0 కలెక్షను క్రాస్ చేయడం జరిగింది. జైలర్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆల్ టైమ్ అత్యధిక తమిళ వసూళ్లను సాధించిన రెండవ చిత్రం గా రికార్డుల్లో నిలిచింది.ప్రస్తుతం మణిరత్నం  పోన్నియన్ సెల్వన్ టాప్ ప్లేస్ లో ఉంది.


యూఎస్ లో రెండు 5 మిలియన్ డాలర్లు సినిమాలను కలిగే ఉన్న ఏకైక కోలీవుడ్ హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ చరిత్ర సృష్టించాడు.. జైలర్ చిత్రం రోబో 2.0 చిత్రం రికార్డ్ లను కాకుండా అన్ని కోలీవుడ్ రికార్డులను కూడా బద్దలు కొట్టినట్లు సమాచారం తెలుస్తుంది.అంతేగాక ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 500 కోట్ల మార్క్ ని అందుకొని దూసుకుపోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇంతవరకు ఈ ఫీట్ ని నలుగురు హీరోస్ మాత్రమే అందుకున్నారు. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ 4 500 కోట్ల సినిమాలతో టాప్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో సల్మాన్ 3, థర్డ్ ప్లేస్ లో రెబల్ స్టార్ 2, రజినీకాంత్ 2 సినిమాలతో నిలిచారు. అప్పుడెప్పుడో రోబో సినిమాతో బాలీవుడ్ కి చుక్కలు చూపించిన రజినీకాంత్ ఇప్పుడు జైలర్ సినిమాతో కూడా మరోసారి చుక్కలు చూపిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మించిన జైలర్ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. రమ్యకృష్ణ మర్నా మీనన్, తమన్నా, సునీల్, యోగి బాబు, జాకీ ష్రాఫ్ ఇంకా వినాయకన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అలాగే మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ లాంటి సూపర్ స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: