పాన్ ఇండియా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ శంకర్ కూతురు అదితి..!?

Anilkumar
దర్శకుడు శంకర్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అతిథి శంకర్. కార్తీ జంటగా 'విరుమాన్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈమె. ఆ తర్వాత శివ కార్తికేయ సరసన 'మహా వీరన్' సినిమాలో కూడా నటించింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విఝవర్ధన్ దర్శకత్వంలో అధర్వ తమ్ముడు ఆకాశమురులకి జంటగా ఒక సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత రాక్షసన్ సినిమా ఫేమ్ రామ్ కుమార్ తాజా సినిమాలో నటించడానికి అతిథి శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 


అయితే గత కొంతకాలం క్రితం సూర్యతో ఒక సినిమా చేయడానికి అతిధి రెడీ అయింది అన్న వార్తలు వినిపించాయి. ప్రస్తుతం శివా దర్శకత్వంలో కంగువ అనే ఒక భారీ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడివాసల్' అనే సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంతకుముందు సుధా కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రో అని సినిమాలో నటించాడు సూర్య . ఇక ఈ సినిమాలో నటించిన సూర్య జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని గెలిచాడు. 


కాగా ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా సూర్య నటించే 43వ సినిమా. అయితే ఈ సినిమాలో సూర్యకి జంటగా నటి అతిథి శంకర్ నటించబోతుంది అన్న వార్తలు వినబడుతున్నాయి. దీనికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కార్తీ తో నటించి విజయాన్ని అందుకున్న అతిథి శంకర్ ఇప్పుడు ఆయన అన్నయ్యతో కూడా కలిసి నటించడానికి కూడా రెడీ అయింది.మరి సూర్య సరసన నటిస్తున్న సినిమాతో ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: