రజినీకాంత్ చేసిన పనికి అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..!
ముఖ్యంగా రజనీకాంత్ చేసిన ఈ పనిపై అభిమానులు అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలో తిరుగులేని సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ ఇంటర్నేషనల్ గా మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు ఇండియా మినహాయించి విదేశాల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న ఈయన చాలాకాలంగా హిట్లు లేక ఆయన రేంజ్ తెలియలేదు కానీ తాజాగా జైలర్ సినిమాతో తన క్రేజ్ మరొకసారి నిరూపించుకున్నారు ఈ చిత్రం ఓవర్సీస్ లో దాదాపు రూ .200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం.
ఇక ఏ హీరో అభిమాని అయినా సరే సహజంగా రజనీకాంత్ కి ఫ్యాన్ అవ్వాల్సిందే. సినిమాకి అతీతంగా ఆయనను అభిమానించే వారు కూడా ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ ఇలా యోగి కాళ్లకు నమస్కారం చేయడం ఇప్పుడు పెద్ద రచ్చ లేపుతోంది. తన ఆత్మ గౌరవాన్ని సీఎం యోగి కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని అభిమానులు, తమిళ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ చేసిన పని అత్యంత విచారకరంగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది రజినీకాంత్ తన ఆత్మ గౌరవాన్ని తమిళనాడులోనే వదిలేశాడా ఏంటి అంటూ ట్రొల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.