ధనుష్ మూవీ కోసం.. రష్మిక అంత తక్కువ తీసుకుంటుందా.. ఎందుకు?

praveen
కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా హీరోయిన్గా అవతారం ఎత్తిన రష్మిక మందన్న ఆ తర్వాత తెలుగులో చలో అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. ఎందుకో ఇండస్ట్రీలో రష్మిక మందన్నకి ఆ అదృష్టం కూడా బాగా కలిసి వచ్చింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది మహేష్ బాబు నటించిన సరేలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్ కొట్టేయడం.. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఒక్కసారిగా స్థానిక హీరోయిన్గా మారింది ఈ ముద్దుగుమ్మ.


 ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించ్చింది. ఇప్పుడు శ్రీ లీల హవా నడుస్తూ ఉండడంతో టాలీవుడ్లో రష్మికకు కాస్త అవకాశాలు తగ్గాయి. అయితే తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ అటు కోలీవుడ్ లో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో కేవలం అల్లు అర్జున్ సరసన పుష్ప 2 అనే ఒక్క సినిమాలో మాత్రమే చేస్తుంది. అయితే కోలీవుడ్లో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమాలో రష్మిక సెలెక్ట్ అయింది అన్న విషయం తెలిసిందే. సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ధనుష్ మరోసారి డిఫరెంట్ స్టోరీ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.


 ధనుష్ కెరియర్ లో 51 సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక కనిపించబోతుందని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ధనుష్ సినిమా కోసం రష్మిక తీసుకుంటున్న రెమ్యూనరేషన్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. మామూలుగా అయితే ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రష్మిక రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అయితే శేఖర్ కమ్ముల ధనుష్ కాంబో  సినిమాకు మాత్రం కాస్త తక్కువే డిమాండ్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. కేవలం రెండు కోట్లు మాత్రమే తీసుకుంటుందట. అయితే ఇలా తక్కువ పారితోషకం తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. టాలీవుడ్ లో ఎక్కువ పోటీ ఉన్న నేపథ్యంలో ఇక తక్కువ డిమాండ్ చేస్తేనే మేకర్స్ తనను సినిమాలో పెట్టుకుంటారని ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందట రష్మిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: