బోళాశంకర్ డిజాస్టర్.. పది కోట్లు వదిలేసిన చిరంజీవి?
దీంతో నిర్మాత అనిల్ సుంకర కు భారీగా నష్టాలు కూడా వచ్చాయి. అయితే ఇక ఈ సినిమా ఫ్లాప్ విషయంలో అనిల్ సుంకర మెగాస్టార్ చిరంజీవి మధ్య వివాదం ఏర్పడింది అంటూ వార్తలు వచ్చాయి. ఏకంగా చిరంజీవి రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాత ఘాటు ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా అనిల్ సుంకర ఇల్లు పొలాలు తాకట్టు పెట్టి మరి ఇక చిరు రెమ్యూనరేషన్ చెల్లించినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఒకవైపు నిర్మాత అనిల్ సుంకరని ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవిని కూడా సూపర్ మీడియాలో ట్రోల్ చేశారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని.. ఎప్పుడూ తనకు మద్దతుగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు అనిల్ సుంకర. అయితే ప్రస్తుతం మరో ఆసక్తికర వార్త వైరల్ గా మారిపోయింది. బోళాశంకర్ సినిమాకు చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ లో 10 కోట్ల రూపాయలు నిర్మాత అనిల్ సుందరకు తిరిగి ఇచ్చేశాడు అన్నది తెలుస్తుంది. చిరు రెమ్యునరేషన్ 60 కోట్లు కాగా ముందుగా 50 కోట్లు ఇచ్చారట. పది కోట్లు చెక్ రూపంలో ఇస్తే ఇక సినిమా విడుదలైన ప్లాప్ అని తెలిసి నిర్మాత కష్టాలను అర్థం చేసుకొని చిరంజీవి ఆ చెక్కును తిరిగి ఇచ్చేసారట. అయితే పారితోషకం విషయంలో అనిల్ సుంకరని చిరంజీవి బాధపెట్టారు అన్నది మాత్రం అవాస్తవం అని తెలుస్తుంది.