ఆ విషయంలో రౌడీ హీరోని ఫాలో అవుతున్న యువ హీరో....!!

murali krishna
టాలీవుడ్ రౌడీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.. ఈయన అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూర్తిగా తన స్టైల్ అండ్ మ్యానరిజాన్ని మార్చేశాడు.యంగ్ హీరోస్ లో తనదైన స్టైల్ తో మెప్పిస్తూ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు.. ఈయన అందు కే అతి కొద్దీ సమయం లోనే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ తో స్టార్ గా ఎదిగాడు.ఇక విజయ్ తర్వాత అలాంటి మ్యానరిజం తోనే యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.. విశ్వక్ విభిన్న సినిమాల తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా కొన్ని వివాదాల తో కూడా ఫేమస్ అయ్యాడు.. మరి ఈ యంగ్ హీరోస్ మధ్య కొన్ని పోలికలు ఉంటాయని అందరు అంటుంటారు.ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ ఒక విషయం లో విజయ్ ను ఫాలో అవుతున్నాడు అనే ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది..

దీంతో ఈ ఇద్దరి హీరోల పై ఒక టాక్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇటీవలే విజయ్ ప్రజెంట్ నటిస్తున్న 'ఖుషి' మూవీ కోసం హీరోయిన్ సమంతతో కలిసి లైవ్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి స్టేజ్ మీదనే రొమాన్స్ తో ఆకట్టు కున్నారు.ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా తన కొత్త సినిమా ప్రమోషన్స్ భాగంలో ఇదే మాదిరి గా స్టేజ్ మీద డాన్స్ చేసి ఆకట్టు కున్నాడు.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్ జరుగగా ఇందు లో విశ్వక్ సేన్ హీరోయిన్ నేహా శెట్టి తో కలిసి రొమాంటిక్ డాన్స్ చేసాడు.. మరి ఈ విషయం లో విజయ్ దేవరకొండ ను విశ్వక్ ఫాలో అవుతున్నా రంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: