బిగ్ బాస్ సెవెన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు ఏడవ సీజన్కు సిద్ధమయ్యింది బిగ్ బాస్. త్వరలోనే సీజన్ సెవెన్ రాబోతోంది. మరో సారి కింగ్ నాగార్జున సీజన్ సెవెన్ కి హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే దీని నుండి విడుదలైన ప్రోమోలు ఈ సీజన్ పై భారీ అంచనాలను పెంచేసాయి. ఈసారి కొత్తగా ఉండబోతుందని నాగార్జున సైతం ఇటీవల ప్రోమోలలో హింట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి ఉల్టా పుల్టా అంటూ అభిమానుల్లో ఒక ఊహించని క్రేజ్ పెంచేశాడు నాగార్జున. ఇదిలా ఉంటే ఇక ఈసారి విడుదల చేసిన బిగ్ బాస్ ప్రోమో
చాలా వెరైటీగా ఉంది. మును పెన్నడు లేని విధంగా ఈ ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. అయితే మొన్న మద్య విడుదలైన ప్రోమోలో ఇద్దరు లవర్స్ ని చూపించారు నిర్వాహకులు. ప్రియుడు కొండమీద నుండి దూకుతుంటే ప్రేయసి అతడిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉండడం మనం చూడవచ్చు. ఇంతలో నాగార్జున ఎంట్రీ ఇచ్చే బిగ్ బాస్ గురించి అప్డేట్ ఇస్తాడు. అయితే ఇలాంటి క్లైమాక్స్లో మనం సినిమాల్లో చూసాం .ఈసారి క్లైమాక్స్ మార్చేద్దాం అంటూ బిగ్ బాస్ గురించి నాగార్జున తెలిపాడు. ఇక ఈ వీడియో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అయితే ఈ ప్రోమోలో నటించిన
వారి గురించి ప్రేక్షకులు ఆడ ఆరా తీయడం మొదలుపెట్టారు అయితే. ఈ వీడియోలో ఉన్న ఇద్దరు ఎవరో.. ముఖ్యంగా ఆ వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరు అని తెగ సర్చ్ చేస్తున్నారు జనాలు. ఇక ఈ ప్రముఖులు నటించిన అమ్మాయి పేరు అలేఖ్య రెడ్డి. పలు సినిమాల్లో ఈ అమ్మాయి మనకి కనిపిస్తోంది. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ అలరిస్తోంది ఈ అమ్మాయి. అశోక వనంలో అర్జున కళ్యాణం ఇంటింటి రామాయణం అర్థమైందా అర్జున్ కుమార్ వంటి సినిమాల్లో అలేఖ్య రెడ్డి కనిపించింది. అయితే ఈ అమ్మడు కేవలం ప్రమోలేనే కనిపిస్తుందా లేక బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీఅంశంగా మారబోతోంది. అయితే ఈ సీజన్లో చాలామంది సెలెబ్రిటీ లు కూడా వస్తున్నారు అన్న సమాచారం వినబడుతోంది. దాదాపు 20 మంది కంటెస్టెంట్లతో ఈ షో ప్రారంభం కాబోతోంది..!!