టాలీవుడ్ యువ హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ కొంత కాలం క్రితం ఎఫ్ 3 అనే కామెడీ ప్లేస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే . ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న గాండివధారి అర్జున అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు . ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు .
ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది . వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది.
ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడం తో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది . ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రవీణ్ సత్తార్ ఆఖరుగా నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.