మళ్ళీ చర్చలలో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ !

Seetha Sailaja
విజయ్ దేవరకొండను యూత్ కు ఐకాన్ హీరోగా దగ్గరకు చేసింది అతడి యాటిట్యూడ్. దీనికితోడు అతడి విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ తెలంగాణ యాస చాల డిఫరెంట్ గా ఉండటంతో తెలుగు రాష్ట్రాలలోని యూత్ కు క్రేజీ హీరోగా ఇతడు మారిపోయాడు. ‘గీత గోవిందం’ తో ఇతడి మ్యానియా తార స్థాయికి చెరినప్పటికీ ఆతరువాత వచ్చిన చాల సినిమాలు వరస పరాజయాలు చెందడంతో ఇతడి హవా కొంతవరకు తగ్గింది.


క్రితం సంవత్సరం విడుదలైన ‘లైగర్’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆసినిమాకు 200 కోట్ల కలక్షన్స్ రావడం గ్యారెంటీ అంటూ అనేక సందర్భాలలో ఓపెన్ గా చేసిన ప్రకటనతో మళ్ళీ ఇతడి యాటిట్యూడ్ తెరపైకి వచ్చింది. అయితే ఆసినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో అతడి యాంటీ ఫ్యాన్స్ విపరీతంగా అతడిని టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేయడంతో కొంతకాలంగా విజయ్ తాను ఇచ్చే ఇంటర్వ్యూలలో అదేవిధంగా అతడి మాటలలో మితిమీరిన అత్యుత్సాహాన్ని తగ్గించాడు.


అయితే లేటెస్ట్ గా జరిగిన ‘ఖుషీ’ మూవీ ఫంక్షన్ లో అతడు ప్రవర్తించిన తీరును పరిశీలించిన వారు మళ్ళీ విజయ్ లో యాటిట్యూడ్ నిద్ర లేచింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంతతో కలిసి స్టేజ్ మీద అతను చేసిన రొమాంటిక్ విన్యాసాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఈ విన్యాసాలను చూసిన వారు విజయ్ ఏమాత్రం మారలేదని కామెంట్ చేస్తున్నారు.


ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పాటలకు అదేవిధంగా ట్రైలర్ కు వచ్చిన స్పందన చూస్తుంటే విజయ్ మరొక హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు. అయితే ఒక సినిమా పై విపరీతమైన అంచనాలు ఏర్పడటం కూడ ఇప్పుడు సమస్యగా మారుతోంది.  ఆ అంచనాలను  అందుకోవడంలో అదేవిధంగా ఆమూవీ కథలో స్క్రీన్ ప్లేలో ఏమాత్రం కొత్తదనం లేకపోయినా ప్రేక్షకులు వెంటనే ఆసినిమా పై ఫ్లాప్ ముద్ర వేస్తున్నారు. దీనితో సినిమా విడుదలకు ముందు మ్యానియా ఏర్పడటం కూడ మరొక విధమైన సమస్యగా మారిపోతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: