నో ప్రమోషన్స్ పాలసీని బ్రేక్ చేయనున్న నయనతార..!?

Anilkumar
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు తాజాగా జవాన్ సినిమాలో షారుక్ తో కలిసి నటిస్తోంది నయనతార. ఇక ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈమె అభిమానులు. ఇప్పటికే పలు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు తన సినిమాలను ప్రమోట్ చేసే విషయంలో కొంచెం భిన్నంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె గత ఇంటర్వ్యూలలో ఆమె చేసే పని గురించి మాట్లాడుతూ..


ఈవెంట్లకు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పుకువచ్చింది. తన ఆలోచనలను ప్రైవేటుగా ఉంచడానికి ఇష్టపడుతుంది అని.. అందరితో పంచుకోవడం ఆమెకి అసౌకర్యంగా ఉంటుంది అని.. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొంది నయనతార. ఇతర నటి నటుల లాగా నయనతార తన సినిమాలను చురుకుగా ప్రమోట్ చేయదు. ఇక అప్పట్లో కొరియోగ్రాఫర్ మరియు ఫిల్మ్ మేకర్ ప్రభుదేవాతో ప్రేమలో పడిన ఆమెకు కొన్ని కారణాలవల్ల అప్పటినుండి ఈ విధానాన్ని ఫాలో అవుతుంది. ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు చాలా మంది పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లిస్తామని


చెప్పినప్పటికీ నయనతార ఇలా సినిమాల ప్రచారాల్లో పాల్గొనడానికి అసలు ఇష్టపడదు. అంతేకాదు ప్రమోట్ చేయను అని ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటుంది నయనతార. అలా ఆమె నటించిన సినిమాలకి సంబంధించిన ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఈవెంట్లకి సాధారణ ప్రచార కార్యక్రమాల్లో కూడా నయనతార పాల్గొనదు. గతంలో నయనతార చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆమె జవాన్ సినిమా కోసం ఆమె ఫిక్స్ అయిన పాలసీని బ్రేక్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జవాన్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె  తన కెరీర్ కు హెల్ప్ అవ్వాలి అన్న కారణంగా ప్రమోషన్స్ లో పాల్గొంటుందని చాలామంది భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: