ఒక్కరోజే సినిమా కోసం.. 140 కోట్లు ఖర్చు చేసారూ?

praveen
సాదరణంగా ప్రతి వారం ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇక అన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడమే లక్ష్యంగా ఇక బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతూ ఉంటాయి. కానీ ఇలా విడుదలైన సినిమాలలో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణకు నోచుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా ప్రేక్షకాధరణకు నోచుకున్న సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే రికార్డు స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు ఒకేరోజులో ఏకంగా 50 కోట్లు 100 కోట్ల వసూళ్లు రావడం చూసాము. కానీ ఇక్కడ మాత్రం ఒకే రోజు ఏకంగా 140 కోట్ల వసూలు వచ్చాయి. ఇది కాస్త ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే ఇలా అత్యధిక వసూళ్లు వచ్చింది ఏ రోజో కాదు అందరికీ హాలిడే అయినా స్వాతంత్ర దినోత్సవం రోజు. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రభుత్వ కార్యాలయంతో పాటు ప్రైవేట్ ఎంప్లాయిస్ కి కూడా హాలిడే ఉండడంతో ఈ హాలిడేని మరింత స్పెషల్ గా మార్చుకోవాలని సినీ ప్రేక్షకులందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకొని ప్రస్తుతం థియేటర్లలో రచ్చ చేస్తున్న సినిమాలను చూస్తే ఎంత బాగుంటుందని ఆలోచన చేశారు. దీంతో ఇక హాలిడే యూస్ చేసుకోవడానికి అందరూ కూడా థియేటర్లకు బారులు తీరారు అని చెప్పాలి. ఇంకేముంది రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి.



 అయితే ఈ వసూళ్లన్నీ వచ్చింది కేవలం ఒక్క సినిమాకి కాదు.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న బడా సినిమాలు అన్నిటికీ కలిపి.. ఒకే రోజు ప్రేక్షకులందరూ చూసేందుకు 140 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఉన్న థియేటర్లలోని అన్ని సినిమాలకు కలిపి ఇలా ఒకే ఒక్క రోజు 140 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. కాగా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని వసూళ్లు సాధిస్తున్న సినిమాలు రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాతో పాటు గదర్  సినిమా కూడా కలెక్షన్స్ లో రికార్డు సృష్టిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: