గుంటూరు కారంలో మహేష్ ఊర మాస్ అట?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా అనౌన్స్ చేసి మొత్తం రెండేళ్లు కావోస్తున్నా కూడా ఇప్పటికీ షూటింగ్ మాత్రం చాలా నెమ్మదిగానే జరుగుతుంది. ఇక కొంతకాలం నుంచి ఈ గురించి చాలా రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముందుగా ఈ ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేయగా.. వివిధ కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని.. అందువల్ల యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లుగా టాక్ నడిచింది. అయితే ఈ వార్తలపై ఇప్పటి దాకా మూవీ యూనిట్  ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ పై అంచనాలను క్రియేట్ చేసింది.



ఇక ఇటీవల ఈ మూవీ నుంచి మహేష్ కు సంబంధించిన కొత్త పోస్టర్లని రిలీజ్ చేయగా అవి ఒక రేంజ్ లో అదరగొట్టిన సంగతి కూడా తెలిసిందే. ఇక మహేష్ లుంగీ పోస్టర్ అయితే నెట్టింట బాగా చక్కర్లు కొడుతుంది. ఈ పోస్టర్‏లో క్లాసిక్ నలుపు రంగులో ఫ్యాషన్ ఫార్ ఫెచ్ R13 బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ షర్ట్ లో మహేష్ ఉబెల్ కూల్ గా మాస్ గా కనిపిస్తున్నారు. ఆడంబరానికి నిజమైన చిహ్నంగా కనిపిస్తోన్న ఆ షర్ట్ ధర ఏకంగా రూ.74,509 ఉందని సమాచారం తెలుస్తోంది. మాస్ లుక్ లో మహేష్ చాలా సింపుల్ గా కనిపిస్తోన్న ఆ షర్ట్ ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.ఇక రీసెంట్ గా జైలర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమాలో నటించిన టాలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ హీరో సునీల్ మహేష్ బాబు గుంటూరు కారంలో ఊర మాస్ గా నటిస్తున్నాడని చెప్పాడు. అందువల్ల ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహేష్ ఈ న్యూస్ వినగానే తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: