లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన కృతి శెట్టి..!

Divya
టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ రేంజులో పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న తర్వాత లక్కీ హీరోయిన్గా మారింది. దీంతో వరుసగా టైర్2 హీరోలతో అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ , అనుకోకుండా వరుసగా ఫ్లాప్స్ ఎదురవ్వడంతో టాలీవుడ్ లో అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు సినిమాలలో నటిస్తోంది. తమిళంలో మాత్రం వరుసగా అవకాశాలను అందుకుంటోంది. అలా ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన తమిళ్, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది.


ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూలో సుమ మీకు లవ్ బ్రేకప్ అయ్యిందా అని హీరో, హీరోయిన్స్ అడగగా.. అందుకు కృతి శెట్టి సమాధానం ఇస్తూ నాకు బ్రేకప్ అయ్యింది. మా అమ్మకు కూడా తెలుసు నేను రాబోయే రోజుల్లో కూడా సింగల్ గానే ఉండడానికి ఇష్టపడతానంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. అయితే కాలేజీ చదువుకునే రోజులలో కృతి శెట్టి లవ్ ఫెయిల్యూర్ అయిందని అభిమానులు అంచనా వేస్తున్నారు.


కానీ తన  బ్రేకప్ అయ్యింది ఎందుకు బ్రేకప్ అయ్యింది అనే విషయం మాత్రం చెప్పలేదు కృతి శెట్టి. హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా తన పాస్టులో కొన్ని బ్రేకప్స్ ఉన్నాయంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారింది.. మరి ఈ సినిమాతో నైన తెలుగులో కూడా అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి మరి కృతి శెట్టి. సినిమా అవకాశాల కోసం రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: