ఏంటి.. నిహారిక విడాకుల విషయం.. ఇంకా ఆమెకు తెలియదా?
జొన్నలగడ్డ చైతన్యతో పెద్దలు సమక్షంలో వివాహం చేశారు. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయింది. అయితే సినిమాలను వదిలిపెట్టడం ఇష్టం లేకనొ.. లేకపోతే చైతన్యతో లైఫ్ సరిగ్గా లేకనో తెలియదు. కానీ చివరికి భర్తతో విడాకులు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది నిహారిక. కొన్నాళ్లపాటు నిహారిక విడాకుల అంశం పుకార్లు మాత్రమే అనుకున్నప్పటికీ తర్వాత చైతన్య నిహారిక ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం కాస్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విడాకుల తర్వాత మళ్లీ నటన వైపు అడుగులు వేసిన నిహారిక వెబ్ సిరీస్ లు సినిమాలు అంటూ బిజీగా మారింది.
ఇప్పుడు నిహారిక విడాకులకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. నిహారిక విడాకులు తీసుకున్న అంశం నాగబాబు తల్లి అంజనాదేవికి ఇప్పటివరకు తెలియదుట. ఆమెకు తెలియకుండానే కుటుంబం మొత్తం ఈ విషయాన్ని దాచిపెడుతుందట. అయితే శ్రీజ విషయంలో రెండు సార్లు విడాకులు అవడంతో అంజనా దేవి చాలా మెంటల్ స్ట్రెస్ కు గురయ్యారట. ఆడపిల్ల జీవితం అంటే ఎంతో ఇంపార్టెంట్ అని ఆలోచించే అంజనాదేవి శ్రీజ విడాకులు తీసుకునే సరికి కాస్త బాధపడ్డారట. అందుకే ఇక నిహారిక విడాకుల అంశం గురించి ఆమెకు తెలిస్తే ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అని ఇక మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక విడాకులు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారట. కాగా అంజనాదేవికి టీవీ చూసే అలవాటు లేదు.. మొబైల్స్ కూడా వాడరు.. తద్వారా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఆమెకు ఈ విషయం తెలియలేదు అని తెలుస్తుంది.