ఇండియా వ్యాప్తంగా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు అనుపమ్ కేర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఈయన అలరించాడు. ఇకపోతే పోయిన సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన తెలుగు సినిమా అయినటు వంటి కార్తికేయ 2 లో అనుపమ్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు . ఈయన ఈ సినిమాలో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించినప్పటికీ ఆ తక్కువ టైమ్ ఉన్న పాత్ర తోనే ఈయన ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించాడు.
ఇక పోతే ప్రస్తుతం ఈ నటుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 20 వ తేదీ న తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అనుపమ్ కి సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ మూవీ లో ఈయన రాఘవేంద్ర రాజపుత్ అనే పాత్రలో ఐబి ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఈయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఈయన స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ఇకపోతే టైగర్ నాగేశ్వరరావు మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.