అవును నిజమే.. నేను అర్ధ నగ్నంగా నటించాను : ఆండ్రియా

praveen
కోలీవుడ్ నటి ఆండ్రియా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. మాటకి కోలీవుడ్ అన్నమాటే. కానీ ఇక అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా రేంజ్ ఉన్న నటిగా కొనసాగుతూ ఉంది ఈ 36 ఏళ్ల ముద్దుగుమ్మ. ఇక ఎక్కువగా బోల్డ్ పాత్రలు చేస్తూ తన అంద చందాలతో ప్రేక్షకులు అందరి మతిపోగుడుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే అటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించింది ఈ సొగసరి. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంది  అని చెప్పాలి. అయితే ఆండ్రియా కేవలం నటి మాత్రమే కాదు సింగర్ కూడా.

 ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో పుట్టిన ఈ అమ్మడు చిన్నప్పటినుంచె సంగీతం నేర్చుకుంది. ఇక పుష్ప సినిమాలో సూపర్ హిట్ అయిన ఊ అంటావా పాటను తమిళంలో పాడి ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు నటిగా సింగర్ గా కూడా బిజీ బిజీగా ఉంది. అయితే ఇటీవల  ఈమె నటించిన ఒక పాత్ర ద్వారా సోషల్ మీడియాలో విమర్శలు కూడా ఎదుర్కొంది. దర్శకుడు వెట్రిమారన్ నిర్మించిన అనల్ మేల్ పనితులి చిత్రంలో ఆండ్రియా ఒక సన్నివేశంలో అర్థనగ్నంగా నటించింది. దీంతో ఇక ఈ సన్నివేశంపై విమర్శలు కూడా వచ్చాయి.

 ఇక తన పాత్ర గురించి వస్తున్న విమర్శలపై ఇటీవల ఆండ్రియా స్వయంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. నిజమే ఆ చిత్రంలో ఒక సన్నివేషన్లో నిజంగానే అర్థనగ్నంగా నటించాను. అయితే అలా నటిస్తున్నప్పుడు తనకే చాలా బిడియంగా అనిపించింది అంటూ తెలిపింది. అయితే నిజ జీవితంలో తనకు ఇంతకుమించిన సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి అంటూ ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా ప్రస్తుతం పిశాచి 2 తో పాటు మాలిగై, నో ఎంట్రీ, బాబి ఆంటోని చిత్రం అంటూ అరడజనుకు పైగా  సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సైందవ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: