'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రిలీజ్ డేట్ చెప్పేసిన హీరో..!?

Anilkumar
'జాతి రత్నాలు' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా తోటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు ఆయన. ప్రస్తుతం 'మిస్ షట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాగా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్క శెట్టి నటిస్తోంది. అయితే ఈ సినిమా చాలా రోజులుగా నెమ్మదిగా జరుగుతోంది. ఈ సినిమాని యూవీ  క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. 


లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాని ఆగస్టు 4న విడుదల చేస్తామని చిత్ర బంధం ఎప్పుడో ప్రకటించారు. ఇక దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఈ సినిమాని మళ్లీ వాయిదా వేసినట్లుగా అప్పట్లో తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ క్లారిటీ ఇచ్చారు చిత్ర బృందం. కృష్ణాష్టమి రోజున అంటే సెప్టెంబర్ 7న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తాజాగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ యు వి క్రియేషన్స్ ఒక వీడియోని సైతం విడుదల చేయడం జరిగింది.


ఇప్పటికె ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ పోస్టర్స్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లో సైతం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాహుబలి నిశ్శబ్దం సినిమాల తరువాత అనుష్క నటిస్తున్న సినిమా ఇది. అయితే దాదాపుగా మూడేళ్ల తర్వాత అనుష్క వెండితెరపై కనిపించబోతోంది.  ఈ సినిమా కోసం అనుష్క అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: