ఇప్పుడు లక్కీ లెగ్ అన్న వాళ్లే అప్పుడు ఐరన్ లెగ్ అంటారు..!

shami
మసూద, బలగం సినిమాలతో హిట్ అందుకున్న తెలుగు అమ్మాయి కావ్య కళ్యాణ్ రాం ఆ రెండు సినిమాలతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. లేటెస్ట్ గా శ్రీ సిం హా నటించిన ఉస్తాద్ లో కూడా అమ్మడు నటించింది. అయితే ఆ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇదిలాఉంటే బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రాం తో ఆమెతో నటించిన ముగ్గురు లీడ్ యాక్టర్స్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఉస్తాద్ ప్రమోషన్స్ లో భాగంగానే ఇది జరిగింది.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమెది లక్కీ హ్యాండ్.. లక్కీ లెగ్ అని ప్రస్తావించారు ప్రియదర్శి, శ్రీ సిం హా. అయితే హిట్లు పడితే లక్కీ హ్యాండ్ అంటారు కానీ అదే రెండు ఫ్లాపులు పడితే ఐరన్ లెగ్ అని కూడా అంటారని చెప్పింది కావ్య. అంటే ఏదో సినిమాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అని కాకుండా హిట్ పడితే ఒకలా ఫ్లాప్ వస్తే మరోలా ట్రీట్ చేస్తారని పర్ఫెక్ట్ పిక్చర్ అర్ధమయ్యే కావ్య తన సినిమాల ఎంపిక చేస్తుందని చెప్పొచ్చు.

కావ్య కళ్యాణ్ రాం తెలుగు అమ్మాయి అవడం వల్ల ఆమెకు ఎలాంటి సీన్ లో అయినా అవలీలగా నటించగలిగే అవకాశం ఉంటుంది. బలగం సినిమాలో ఆమెకు పెద్దగా నటించే స్కోప్ దొరకలేదు కానీ ఆ సినిమా హిట్ తన ఖాతాలో వేసుకుంది. కచ్చితంగా కావ్య కళ్యాణ్ రాం తెలుగు హీరోయిన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదిస్తుందని చెప్పొచ్చు. కావ్య  కూడా ఇది అది కాకుండా ఎలాంటి సినిమా వచ్చినా చేస్తానని చెబుతుంది. గంగోత్రి లో బుజ్జి పాపగా కనిపించిన కావ్య ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. వచ్చిన క్రేజ్ తో పాటు హిట్లు కూడా పడితే అమ్మడి కెరీర్ సెట్ అయినట్టె లెక్క.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: