అఫిషియల్ : వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్... విడుదల తేదీ ప్రకటన..!

Pulgam Srinivas
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆఖరుగా ఎఫ్ 3 అనే మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు . ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో రూపొందుతున్న గండేవాధర అర్జున అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. సాక్షా వైద్య ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నాజర్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 25 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే గాండేవదరా అర్జున సినిమా విడుదల కాకముందే వరుణ్ శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వంలో ఓ మూవీ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే.


ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ ను మరియు విడుదల తేదీని ప్రకటించారు. వరుణ్ ... శక్తి ప్రతాప్ సింగ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు "ఆపరేషన్ వాలెంటైన్" అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు మూవీ బృందం ప్రకటిస్తూనే ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ బృందం ఈ సినిమాను కొన్ని నిజ సంఘటన ఆధారంగా రూపొందించబోతున్నట్లు ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయడానికి ఈ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: