భోళా శంకర్ రివ్యూ: చిరుకి మరో ఆచార్య?

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా 'భోళా శంకర్‌’ నేడు విడుదల అయ్యింది. అసలు ఏమాత్రం కొత్తదనం లేని ఫక్తు ఫార్ములా కథ ఇది. ఎప్పుడో 80దశకం నాటి ట్రీట్‌మెంట్‌తో దర్శకుడు మెహర్‌ రమేష్‌ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆసాంతం పేలవమైన కథ, కథనాలతో సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు కాస్త రిలీఫ్‌నిచ్చే అంశం ఏమైనా ఉందంటే అది చిరంజీవి తాలూకు ఛరిష్మా, నృత్యాల్లో ఆయన కనబరచిన గ్రేస్‌ ఇంకా ఒకటి రెండు సాంగ్స్ మాత్రమే. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కలకత్తాలో అమ్మాయిల కిడ్నాప్‌ నేపథ్యంలో సాగుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్‌ సీన్స్‌ను అభిమానులను మెచ్చేలా తెరకెక్కించారు. ఆరంభంలో చిరంజీవి ఇంకా వెన్నెల కిషోర్‌ మధ్య వచ్చే సన్నివేశాల్లో ఏ మాత్రం వినోదం పండలేదు. జనాలని బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. చిరంజీవి ఇంకా తమన్నా మధ్య నడిచే లవ్‌ట్రాక్‌ కూడా అసలు ఏమాత్రం ఆకట్టుకోదు. సన్నివేశాలన్నీ కూడా సాగతీతగా అనిపిస్తాయి. అసలు సినిమా కథలోని మెయిన్‌ పాయింట్‌ సెకండ్ హాఫ్ తో ముడిపడి ఉండటంతో ఫస్టాఫ్‌ మొత్తం బోరింగ్‌ వ్యవహారంలా అనిపిస్తుంది. అయితే విరామంలో వచ్చే ట్విస్ట్‌ సెకండాఫ్‌ ఎలా ఉంటుందోననే ఆసక్తిని అయితే కలిగిస్తుంది.



సెకండ్ హాఫ్ లో చిరంజీవి తనదైన కామెడీ, యాక్షన్‌తో మెప్పించాడు. కీర్తి సురేష్‌ ఇంటి నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో కాస్త హాస్యం బాగానే పండింది. చిరంజీవి ఈ సినిమాలో మంచి హుషారుగా కనిపించారు. ఆయన లుక్స్‌ కూడా బాగున్నాయి. శ్రీముఖితో చేసిన 'ఖుషి' నడుము సీన్‌ అయితే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అన్నాచెల్లెళ్ల అనుబంధం అనే బలమైన సెంటిమెంట్‌ అంశంతో తెరకెక్కించిన ఈ సినిమాలో భావోద్వేగాలు పూర్తిగా లోపించాయి. అయితే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను మాత్రం స్టెలిష్‌గా డిజైన్‌ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఎలివేషన్స్‌ ఆకట్టుకుంటాయి.ఇక క్లెమాక్స్‌ కూడా ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే సాగుతుంది. ఈ సినిమా కథాంశం విషయంలో నేటి ట్రెండ్‌కు తగినట్లుగా కాస్త హోమ్‌వర్క్‌ చేస్తే కొంచెం బాగుండేది. అయితే ఈ విషయంలో దర్శకుడు మెహర్‌ రమేష్‌ ఏ మాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదనిపిస్తుంది. అయితే మెగాస్టార్ మాత్రం తనవైపు నుంచి సినిమాకు పూర్తిగా న్యాయం చేశాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో ఆయన తనదైన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.కానీ కథ మాత్రం రొట్ట కథ. ఈ సినిమాలో ప్లస్ లు కంటే మైనస్ లే ఎక్కువ ఉన్నాయి. చిరుకి ఖచ్చితంగా ఆచార్య లాంటి ప్లాప్ ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: