ఇండస్ట్రీలో స్టార్ నటిగా గుర్తింపు పొందడానికి కారణం అదే :: తమన్నా
ఇదిలా ఉండగా మొన్నటి వరకు తమన్నా పని అయిపోయింది అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ అదే సమయంలో తన సినిమాలతో గట్టి సమాధానమే చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది. మరొకవైపు రజినీకాంత్ జైలర్ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి మొదటి షో తోనే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన నువ్వు కావాలయ్యా పాట ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో.. బాడీ ఫిజిక్ తో.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా బోల్డ్ సన్నివేశాలపై నటించడం గురించి కామెంట్లు చేసింది. కొన్ని కొన్ని సార్లు మన పరిధిలు దాటి నటించాల్సి ఉంటుంది. అలాంటి సన్నివేశాలలో నటించకపోతే స్టార్ హీరోల సినిమాలలో అక్కగా, వదినగా ఆంటీగా నటించాల్సి వస్తుంది.
గ్లామర్ ప్రపంచంలో హద్దులు పెట్టుకుంటే సక్సెస్ కాలేము కాబట్టి గ్లామర్ పరంగా ప్రేక్షకులను మెప్పించగలిగినప్పుడే హీరోయిన్ గా సక్సెస్ అవుతాము. ఇదే నేను నమ్మిన సిద్ధాంతం అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఇన్నేళ్లుగా తను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగడానికి కారణం అని కూడా చెప్పుకొచ్చింది తమన్నా. ఇక ఈమె చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.