తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఈయన కొత్త బంగారు లోకం అనే మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ఈ సినిమా ద్వారా మంచి ప్రశంసలను కూడా ఈ దర్శకుడు అందుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకుంది.
ఇలా కెరియర్ లో రెండు మూవీ లతో రెండు విజయాలను అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత ముకుంద ... బ్రహ్మోత్సవం మూవీ లతో రెండు ఫ్లాప్ లను కూడా అందుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ దర్శకుడు విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన నారప్ప అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు "పెదకాపు" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు.
ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ క్రేజ్ ఉన్న ఒక హీరోతో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ తో శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి మూవీని ప్లాన్ చేస్తున్నట్లు ... ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్లు ... అన్ని కుదిరితే వీరి కాంబినేషన్ లో ఓ మూవీ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.