ఆ ఒక్క తప్పు చేయకపోయుంటే.. నాగ చైతన్య పెద్ద స్టార్ అయ్యేవాడట?

praveen
బ్యాక్ గ్రౌండ్, టాలెంట్ ఉంటె సరిపోదు. కాసంత అదృష్టం కూడా ఉండాలి. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య....అక్కినేని నాగార్జునకి కొడుకు, లెజెండరీ స్టార్ అక్కినేని నాగేశ్వరరావుకి మనవడు, స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కి మేనల్లుడు. భారీ బ్యాక్ గ్రౌండ్ తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగ చైతన్యకి తన ఫామిలీ బ్యాక్ గ్రౌండ్  ఏమాత్రం ఉపయోగ పడలేదనే చెప్పాలి. ఒక మంచి హిట్ వచ్చింది అని సంబరపడి లోపు, రెండు మూడు ప్లాపులు వచ్చి మీద పడుతున్నాయి. ఐతే నాగచైతన్య తన కెరీర్ ఆరంభంలో చేసిన ఒక తప్పే అతనిని టాలీవుడ్లో స్టార్ హీరో అవ్వకుండా ఆపుతోంది.
ఏ హీరోకైనా మొదటి సినిమా చాలా స్పెషల్. మొదటి సినిమా మీదే కెరీర్ అంత ఆధారపడి ఉంటుంది. అందులోను స్టార్ కిడ్స్ కి అది మరీ ఇంపార్టెంట్. కానీ నాగచైతన్య తన డెబ్యూ  మూవీ సెలెక్ట్ చేసుకోవడంలో కాస్త తప్పటడుగు వేసాడని చెప్పాలి. చైతు డెబ్యూ మూవీ జోష్. ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. తోలి చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు యువ సామ్రాట్. ఇది ఆయన కేరీర్ కు పెద్ద మైనస్. ఐతే ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే, నాగ చైతన్య నిజానికి కొత్త బంగారు లోకం చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాల్సింది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం కొత్త బంగారు లోకం. ఈ చిత్రం బాస్ ఆఫీస్ వద్ద బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు హీరో హీరోయిన్లుగా నటించారు. ఐతే నిజానికి ఈ కథ శ్రీకాంత్ అడ్డాల నాగచైతన్య కోసం రాశారట. చైతు డెబ్యూ కి ఈ మూవీ కరెక్టుగా ఉంటుందని ఆయన భావించారట. ఇది ఒక లవ్ స్టోరీ. ఈ కథను, నాగార్జునకు, నాగ చైతన్యకు వినిపించాడట శ్రీకాంత్ అడ్డాల. కానీ చైతు లవ్ స్టోరీ కాకుండా, ఏదయినా మాస్ ఎంటర్టైనర్ ఐతే డెబ్యూ కి బెటర్ అని ఫీల్ అయ్యాడట. దాంతో కొత్త బంగారు లోకం వరుణ్ సందేశ్ వద్దకు చేరింది. కట్ చేస్తే.....కొత్త బంగారు లోకం సూపర్ హిట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ నాగచైతన్య చూస్  చేసుకున్న జోష్ మాత్రం ప్లాప్ అయ్యింది. చైతు తన కేరీర్ లో తీసుకున్న ఒక చెత్త నిర్ణయం ఆయన్ను ఇంకా వెంటాడుతోంది. స్టార్ హీరోల లిస్ట్ లో చేరకుండా ఆపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: