బొమ్మరిల్లు భాస్కర్ ప్రాజెక్ట్ లో యంగ్ హీరో....!!

frame బొమ్మరిల్లు భాస్కర్ ప్రాజెక్ట్ లో యంగ్ హీరో....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో పలు సినిమా లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సందడి చేస్తున్నటువంటి సిద్దు జొన్నలగడ్డ అనంతరం హీరో గా మారిపోయారు.జోష్ ,ఆరెంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు గుంటూరు టాకీస్ సినిమా ద్వారా హీరోగా మారిపోయారు.ఇలా ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరో గా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు అయితే డీజే టిల్లు సినిమా మాత్రం ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా మంచి హిట్ కావడం తో ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్దు టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ పనుల తో పాటు ఇతర సినిమా లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తా జాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బొమ్మరిల్లు సినిమా ద్వారా దర్శకుడు గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ భాస్కర్ ఆరెంజ్ సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు. అనంతరం ఈయన అఖిల్ హీరో గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా పరవాలేదు అనిపించుకున్నారు అయితే త్వరలోనే బొమ్మరిల్లు భాస్కర్ సిద్దు జొన్నలగడ్డతో సినిమా చేయబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరెంజ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి సిద్దు జొన్నలగడ్డ తో ఏకంగా ఓ సినిమా చేయబోతున్నారు అంటే ఇది నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా దాదాపు కరారు అయిందని,ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఆగస్టు 10వ తేదీ ఘనంగా జరుపబోతున్నారని తెలుస్తోంది.ఇక ఇదే రోజున ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను కూడా అధికారకంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: