శ్రీ లీల ని రిజెక్ట్ చేసిన ప్రభాస్.. అసలు కారణం ఏంటో తెలుసా..!?

Anilkumar
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది యంగ్ సెన్సేషన్ శ్రీ లీల. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ తన అందం నటనతో ప్రేక్షకులనే ఒక రేంజ్ లో ఆకట్టుకుంది ఈ చిన్నది. అనంతరం రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించింది శ్రీ లీల. ఇక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విజయంతో ప్రస్తుతం ఈ అమ్మడు 9 నుండి 10 సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలతో శ్రీ లీల రేంజ్ ఒక అరెంజ్ కి వెళ్ళిపోవడంతో


దర్శక నిర్మాతలు ఈమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా యంగ్ హీరోస్ కూడా మొదట ఈమెతోనే సినిమా చేయాలి అని చెప్పడంతో దర్శక నిర్మాతలు ఈమె కోసం క్యూ కడుతున్నారు. ఇక ఒకేసారి అన్ని సినిమాలో చేయలేక ఒక్కో సినిమాని రిజెక్ట్ చేసుకుంటూ పోతోంది ఈ అమ్మడు. కానీ ఒకసారి హీరో మాత్రం శ్రీ లీలనే రిజెక్ట్ చేశాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసే అంత రేంజ్ ఎవరికి ఉంది అని విషయం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీలీలను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో మరెవరో కాదు మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.


ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా స్టార్ హీరో ప్రభాస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అన్న వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. అయితే ఇందులో ఒకరు శ్రీ లీల అంటూ అప్పట్లో టాక్ కూడా వినిపించింది. కానీ శ్రీ లీలా ఈ సినిమాలో నటించిన ప్రభాస్ ఒప్పుకోలేదు అన్న వార్తలు ఇప్పుడు షికార్లు చేస్తున్నాయి. ప్రభాస్ ని చూస్తే ఆరడుగులు ఉంటాడు. కానీ శ్రీ లీల మాత్రం చాలా పొట్టిగా ఉంటుంది అన్న ఒకే ఒక కారణంతో శ్రీ లీల నీ రిజెక్ట్ చేశాడట ప్రభాస్. దాంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: