బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తాజాగా ఇప్పుడు సీజన్ 7 కి రెడీ అయింది. తెలుగులో ఫస్ట్ సీజన్ ను ఈ షోను టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడం మనం చూసాం. అయితే ఆ సీజన్కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక తాజాగా ఇప్పుడు ఈ రియాలిటీ షో తెలుగులో మంచి సక్సెస్ సాధించడంతో పాటు ఊహించని క్రేజ్ తో దూసుకుపోతుంది. అయితే ఈ ఏడో సీజన్ స్టార్ట్ కావడానికి రెడీ అయింది. దీంతో మేకర్స్ కింగ్ నాగార్జునతో ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో ని కూడా విడుదల చేశారు.
దీంతో మళ్లీ సీజన్ సెవెన్ కు కూడా నాగార్జున నే హోస్ట్ అని అందరూ ఫిక్స్ అయ్యారు అందరూ. అయితే తాజాగా ఇందులో ఒక ట్వెస్ట్ ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్త లో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే ప్రోమోలో అయితే నాగార్జున నే హోస్ట్ అని అర్థమవుతోంది.. కానీ ఈ నేపథ్యంలోనే మరొక లేడీ పోస్ట్ కూడా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి హోస్ట్ గా వ్యవహరించబోతోంది అని అంటున్నారు. అయితే ఈ లేడీ పోస్ట్ ఎందుకు ఎవరు అన్న దానిపై ఇప్పటివరకు మాత్రం క్లారిటీ లేదు.
ఏదేమైనప్పటికీ బిగ్బాస్ అంటేనే ఎన్నో ట్విస్ట్ లు అందులోనూ గత సీజన్ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈ సీజన్ ను సక్సెస్ చేసేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే లేడీ హోస్ట్ ని తీసుకురాబోతున్నారా అన్నది ఇక్కడ ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక హోస్ట్ గా ఎవరు వస్తారు అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.!!