తన నటనతో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పటికే దుల్కర్ "మహానటి" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇకపోతే పోయిన సంవత్సరం దుల్కర్ ... హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతా రామం అనే మరో తెలుగు సినిమాలో ఈ యువ నటుడు హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో తన నటనతో దుల్కర్ ప్రేక్షకులను ఎంత గానో అలరించడంతో ఈ నటుడికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది.
ఇకపోతే దుల్కర్ మరికొన్ని రోజుల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందబోయే మరో తెలుగు సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఇకపోతే తాజాగా దుల్కర్ "కింగ్ ఆఫ్ కొత్త" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈనెల 24 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ యొక్క కేరళ హక్కులను వే ఫర్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది.
అలాగే ఈ మూవీ యొక్క తమిళ నాడు , కర్ణాటక మరియు నార్త్ ఇండియా హక్కులను జీ స్టూడియో సంస్థ దక్కించుకోక... ఆంధ్ర మరియు తెలంగాణ హక్కులను ఈ ఫోర్ ఈ మూవీ సంస్థ దక్కించుకుంది. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.