కన్నడ ఇండస్ట్రీ ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే అనేక సినిమా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు లో వరస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.
అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి తెలుగు లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు అనేక హిందీ సినిమాలలో కూడా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే తమిళ్ లో ఈ ముద్దు గుమ్మ విజయ్ హీరోగా రూపొందిన వారిసు సినిమాలో హీరోయిన్ గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఫుల్ క్రేజ్ ను దక్కించుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటి మరో కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళితే ... మరికొన్ని రోజుల్లో చియాన్ విక్రమ్ ... ఆంటోనీ జోసఫ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన ను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉన్నట్లు అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మతో ఈ మూవీ యూనిట్ సంప్రదింపులు జరపగా ఈ నటి కూడా ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.